మొండి 59 మొక్క
telugu stories kathalu novels మొండి 59 మొక్క అందరూ వాళ్ళ వాళ్ళ సరదాలు తీర్చుకునే పనిలో ఉన్నారు... ఒక్క వీరు తప్ప... కొంత మంది ముంబై లోని కామతిపురా కి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు....అది ముంబై లోని ఫేమస్ రెడ్ లైట్ ఏరియా.... మరి కొంత మంది ఫైవ్ స్టార్ హోటళ్లలో సేద తీరడానికి, వెళ్లారు.... ఫైనల్ గా వీరు, ఇంకో ఇద్దరు మాత్రమే అక్కడి రూమ్ లలో మిగిలారు.... అందరూ కాస్త గ్యాప్ ఇచ్చి వెళ్ళిపోతే దివ్య తో మాట్లాడాలని వీరు ఫీలింగ్... కానీ ఆ గాప్ ఏ దొరకడం లేదు.
సరిగ్గా రాత్రి 4 అవుతుంది అనగా వీరు ఉన్న రూమ్ లోకి అడుగు పెట్టాడు.. నవాజ్... అతన్ని చూడగానే గుండెలు అదిరిపోయాయి అక్కడున్న అందరికీ....
" ఏం మీరు వెళ్లలేదా?"
అని గదమాయించాడు నవాబ్...
" సాబ్! గోవా కి వెళ్లాలి అనుకుంటున్నాము. కానీ డబ్బులు.."
" చూతే....నన్ను అడగాలి కదా. ఇంకో 44 గంటల తరువాత ఇండియా పై కొత్త యుద్ధం....ఒక్కడు అట్టెండ్ కాకపోయినా తలకాయ గొర్రెను కోసినట్టు కోసేస్తా..."
అని వాళ్ళకు డబ్బులు పక్కనున్న వాడిని పిలిచి ఇచ్చేసాడు...
అందరూ వెళ్లిపోయారు వీరు తప్ప
" సాబ్"
నవాజ్ కి అప్పటికే నిద్ర మత్తు బాగా పెరిగిపోయింది...
" ఇంకేం కావాలి నీకు"
" నేను మీతోనే ఉంటా సాబ్"
" పిచ్చి లేచిందా....?? మాకు పని ఉంది"
మరి కాసేపు వాదోపవాదాలు నడిచాక వీరు...అక్కడి నుండి సెలవు తీసుకుని బయలుదేరాడు...
వీరు వాళ్ళ కోసం డ్రగ్గిస్ట్ లా , పర్వర్ట్ లా పీక్కుపోయిన మొకంతో నడవడం మొదలుపెట్టాడు..
నవాజ్ పక్కనున్న వాళ్ళు సైలెంట్ గా నవ్వుతున్నారు... వల్ల వైపు నవాజ్ తిరిగి