మొండి 54 కదలిక
telugu stories kathalu novels మొండి 54 కదలిక కుక్కలు మొరుగుతున్నాయి.. పైన ఎవరో నడుస్తున్న శబ్దం వినపడుతోంది. వాళ్ళ వాళ్ళ మాటల్లో ఏదో గొడవ జరుగుతోంది అని మాత్రమే అర్ధం అయ్యింది. ఆ ఏరియా లో ఇదంతా మామూలే... ఎప్పుడూ ఏదో ఒక గొడవ... గొడవ ఎక్కువ అయితేమర్డర్.... ఇది అక్కడి వాసులకు మామూలు కథే
వీరు ఒక్క క్షణం అక్కడి నుండి బయటకు వెళదాం అనుకున్నాడు కానీ అనవసరం అనుకుని కూర్చున్నాడు. రవి సార్ హత్య గురించి సగం తెల్సింది. కానీ అసలు బ్లాక్ స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఆ రోజు పెట్రోల్ బంకు ఎందుకు తగలబెట్టాడు విక్రమ్?? ఇదే అర్ధం కావట్లేదు ఇక. పర్సనల్ గా తీసుకోకూడదు ఇలాంటి విషయాల్ని... కానీ లోలోపల ఎక్కడో పీకుతోంది వీరు కి.
ఇప్పుడు తాను అఫీషియల్ గా సస్పెండ్ అయ్యాడు. ఇక్కడి నుండి నెక్స్ట్ చెయ్యాల్సిన పని ఏంటి?? వయసులో ఉన్నాడు కదా దివ్య తో కలిసి ఏదైనా టూర్ వెల్దామా... లేదా సైలెంట్ గా తన డ్యూటీ తిరిగి స్టార్ట్ చెయ్యాలా?? అన్న ఆలోచనలు వీరు మైండ్ లో తిరుగుతున్నాయి... "సర్లే " అని తనకు తాను సర్దిపుచ్చుకుని లేచి వెళ్తున్నాడు...
వీరు అలా లేచాడో లేదో.. జాబిలో దాచుకున్న పెన్ డ్రైవ్ కింద పడిపోయింది..... తిరిగి జాబిలో వేసుకున్నాడు. ఇప్పుడు నిజంగానే కర్తవ్యం గుర్తొచ్చింది. ఏ ఏజెంట్ కైనా ఒక క్లూ గాని, టార్గెట్ గాని దొరికినప్పుడు మొట్ట మొదట అతనికి తెలియాల్సింది ఎంత టైం ఉందో.... ఇప్పుడు తనకు కూడా అదే భయం. సస్పెండ్ అయ్యానన్న బాధలో మధ్యలో.వదిలేస్తే, ఏదైనా జరగకూడనిది జరిగితే....?? పులవామా దాడి అప్పుడు కూడా.సమాచారం లేటుగా సైనిక అధికారులకు అందడం... వాళ్ళు జాప్యం చెయ్యడం వల్లనే ... అంత మంది సైనికులు మరణించారు....
అలా ఆలోచిస్తూనే తనకు కేటాయించిన రూమ్ కి చేరుకున్నాడు. పొద్దున్న లేచి వెళ్లి... హెడ్ ఆఫీసులో రిపోర్ట్ చేసాడు. వీరు ఊహించినట్టు అతని సస్పెన్షన్ గురించి ఎవరూ అతన్ని