మొండి 49 ఇంటరాగేషన్
telugu stories kathalu novels మొండి 49 ఇంటరాగేషన్ NIA కి తీసుకెళ్లి అక్కడున్న డాక్టర్ తో ముందు ట్రీట్మెంట్ ఇప్పించారు అతనికి. రాత్రి హోటల్ కెళ్ళి రెస్ట్ తీసుకున్న వీరు, పొద్దున్న దాకా బాగా నిద్రపోయి లేచాడు. NIA కి వెళ్లే ముందు, ఒక సారి వాళ్ళు హోటల్ కి వచ్చినప్పటి ఫుటేజ్ చూద్దామని నిర్ణయించుకున్నాడు. పనిలో పనిగా , హోటల్ రూమ్ లో కూర్చుని వైఫై యాక్సెస్ చేసాడు.
ఇప్పుడు అతనికి తెలియాల్సింది హోటల్ వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ ని ఎక్కడ దాస్తారో తెలియడం. ఒక వేళ ఆన్ లైన్ లోకి వాళ్ళు గనుక అప్లోడ్ చేస్తే వెతికి తీయడం.
కాసేపు పాటు , అక్కడ ఉన్న మిగతా ఐపీ అడ్రస్ లను అన్నీ వెతికి చూసాడు వీరు. వాటిలో సీసీ కామ్ ఫోటేజ్ దొరికే సిస్టమ్ ఏదో , వెతకాలి. Angry Ip Scanner అనే సాఫ్ట్వేర్ ద్వారా రెండు మూడు ఐపీ అడ్రస్ లు సీసీ కెమెరావి పట్టుకున్నాడు వీరు. ఆ రెండు ఐపీ అడ్రెస్స్ లలో ఏది ఎక్కువ సెక్యూరిటీ తో ఉంటే , అదే సీసీ కెమెరాకి వాడుతున్న ఐడీ. చివరికి అసలు ఐపీ అడ్రస్ పట్టేశాడు.తరువాత హైడ్రా అనే ఒక సాఫ్ట్ వేర్ వాడి , ఆ ఐపీ పాస్వర్డ్ హాక్ చేసాడు. అతని కాళ్ళ ముందు ప్రత్యక్షమైంది సీసీ కెమెరా ఫుటేజ్. నిన్న రాత్రి ఆరున్నరకు, వచ్చిన మనుషుల వివరాలు అన్నీ చూస్తున్నాడు. కాసేపటికి ప్రత్యక్షం అయ్యింది. అతను వెతుకుతున్న మనుషులు ఉన్న పోర్షన్. మొత్తం చూస్తే , ఆరుగురు ఉన్నారు వెతుకుతున్న వాళ్ళు. అనుమానం రాకుండా అప్పుడప్పుడూ మాట్లాడుతూ , రెండు గ్రూపులుగా విడిపోయి తిరుగుతున్నారు , ఆ ఫ్లోర్ లో. నిన్న చూసింది ఇద్దరి ముఖాలనే , మరో ఇద్దరు ముఖాలు కొత్తవి. అప్పుడు ఉలిక్కిపడి చూసాడు వీరు. అదే ముఖం , చీకట్లో తనకు తెలిసీ , తెలియకుండా కనిపించిన ముఖం. ఆ రోజు పెట్రోల్ బంక్ లో కనిపించిన వ్యక్తిది అది. వీరు అతని ఫేస్ ఉన్న వీడియో ని స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. ఎక్కువ సేపు హాక్ చేస్తే , అవతల వాళ్ళు గుర్తుపట్టే అవకాశం ఉంది. అందుకే లాప్ టాప్