వెన్నెల సోకని పున్నమి 2
telugu stories kathalu novels వెన్నెల సోకని పున్నమి 2 మధ్యాహ్నం గిరిజా, నేనూ ఎడ్లబండిలో సంతకి బయల్దేరాం.
బండిలో ఎన్నికేజీల చింతపండుందో; ఎన్ని బుట్టల సపోటాలు, రామాఫలాలు, సీతాఫలాలూ ఉన్నాయో లెక్కలేసుకుంటోంది గిరిజ. పాపం.. ఎంతో కష్టపడి కిలోమీటర్లకొద్దీ నడిచెళ్ళి మగరాయుడిలా అడవిలోంచి ఈ సరుకంతా పోగేసుకొస్తుంది. ఇంతచిన్నవయసులో ఎన్ని కష్టాలో..!
ఆలోచనల్లో ఉండగానే సంతదగ్గరకి వచ్చేశాం.
సంతంటే ఆ రోజు బస్సులో వస్తున్నప్పుడు చూసిన మార్కెట్టే..! బండిలోని సరుకుని అమ్మకం దగ్గరకి చేర్పించింది గిరిజ. గిరిజతో పాటూ నేనూ 'కోవటిదొర' దగ్గరకి వెళ్ళాను.
గిరిజని చూసి, సరుకు కాటావేస్తూ, "యాభైఐదు.. ఊ.. యాభైకేజీల చింతపండూ.. కేజీకి ఇరవై.. యాభైకేజీలకి ఆరొందలు.. ఇదిగో డబ్బు. ఊ.. ఇంకేమున్నాయ్.." అంటూ ఆరొందలిస్తూ, మిగిలిన సరుకువంక చూశాడు ఆ కోవటిదొర.
డబ్బులు తీసుకుంటున్న గిరిజని చెయ్యిపట్టుకుని ఆపుతూ, "యాభైఐదు కేజీలకి పదకొండొందలు వస్తాయ్ కదా.. ఆరొందలు ఇస్తున్నారేంటి..?" గట్టిగా అడిగాను నేను.
అతను కొంచెం తడబడుతూనే, "ఎంతా..? ఆరొందలేగా" అన్నాడు దబాయిస్తూ.
డబ్బుదగ్గరా, కాటాదగ్గరా అతను చేస్తున్నమోసం అర్థమైంది. ఎప్పుడూ ఇంతేనా..? పాపం.. గిరిజ ఇలా ఎంతసొమ్ము పోగొట్టుకుని ఉంటుందో..!
'చెమటచిందిస్తూ దేహాన్ని కట్టెగా చేసుకునే ఈ గిరిజన బిడ్డల్ని మోసంచేస్తూన్న దళారీలు- ఎందరి కష్టార్జితపు రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటున్నారో..' అనుకోగానే నరాల్లో సర్రునకోపం వచ్చింది.
మా సరుకు వేరేదగ్గర అమ్ముకుంటామంటూ గిరిజ చేయిపట్టుకుని, పక్కకు లాక్కెళ్ళాను. వేరే అతన్ని, "మా దగ్గర యాభైఐదు కేజీల చింతపండు ఉంది.. ఏ రేటు