మనసా వాచా కర్మణా..2
telugu stories kathalu novels మనసా వాచా కర్మణా..2 "ఉ.." అని వెనక్కు తిరిగాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 'అమ్మకి తెలీదా వల్లీ ఇక్కడ లేదని..! ఇది ఎక్కడికెళ్ళినట్టూ..!' అనుకుంటూ బయటకు వచ్చాను.
సంజయ్ కనిపించాడక్కడ. నా కంగారుని చూసి, ఏంటని అడిగాడు. జరిగింది చెప్పాను, అక్కకి వచ్చిన బావగారి ఫోన్‌తో సహా.
ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, "ఇటువెళ్తుంటే ఎవరో అనుకున్నాను. వల్లీ అంటావా.. చూద్దాం రా." అన్నాడు.
ముదిరిన చలికాలం.. మందంగా అల్లుకుని ఉంది మంచు. అల్లంత దూరంలో ఏముందో కూడా కనిపించట్లేదు. నా చెయ్యి పట్టుకుని ఇంటి వెనకవైపుకి నడిచాడు సంజయ్. నా ప్రమేయం లేకుండానే అతన్ని అనుసరించాను.
కొన్ని అడుగుల తర్వాత, నడుస్తూన్న నన్ను బలంగా పట్టి ఆపాడు.
గలగలమంటూ గాజుల చప్పుడు..! నిశ్శబ్దంలోంచి దగ్గరగ వినిపించిన ఆ శబ్దానికి ఒళ్ళు గగుర్పొడిచింది. కళ్ళు చించుకుని చూశానటు.
నిద్రగన్నేరు నీడలో అక్క, బావగారు..! అదీ సర్వం మరిచి ఒకర్నొకరు అల్లుకుని..! తెల్లని మంచుమధ్య నల్లని నీడల్లా కనిపిస్తున్న ఇద్దరి ఆకారాలు, వాటి కదలిక, నాలో గుండెవేగాన్ని పెంచింది.
గట్టిగ సంజయ్ చేతిని పట్టుకుని చూపు మరల్చుకున్నాను. నా ఒంట్లోని రక్తప్రవాహం తెలీని గగుర్పాటుతో రెట్టింపైంది. నాకు తెలీకుండానే సంజయ్‌కి దగ్గరగ జరిగాను. ఇద్దరి శరీరాలూ ఒకదానినొకటి పూర్తిగ తాకుతున్నాయి. నన్ను పక్కగ చీకట్లలోకి లాగాడతను.
మనసులో ఏదో జంకు..! అంతకుమించిన కుతూహలం..! మా అలికిడి వినేమో.. ఏకమైన 'వారిద్దరి' శరీరాలు విడివడ్డాయి.
"నువ్వు వల్లీని తీసుకుని రా.." చెప్పి, నా చేతిపట్టుని విడిపించుకుని నిశ్శబ్దంగా ఇంటివైపు నడిచాడు సంజయ్.
బిరబిరపరుగిడి గుండెవేగాన్ని పెంచిన రుధిరం ఒక్కసారిగ శాంతించింది. పక్కనే ఉన్న గోడకానుకుని, సంజయ్ వెళ్ళినవైపు చూస్తున్నాను.
అక్క వస్తున్న చప్పుడు.. ఎదురెళ్ళాను. అక్కడ నన్నుచూసి