తీరెను కోరిక తీయతీయగా 1
telugu stories kathalu novels తీరెను కోరిక తీయతీయగా 1 కాని, ముద్దుకృష్ణ అందుకు పూర్తిగా వ్యతిరేకం. దాంపత్యమనేది వంశాభివృధ్ధికే అన్న పెద్దల మాటను పూర్తిగా నమ్మినవాడిలా ఉండేది అతడి ప్రవర్తన. ఫలితంగా ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టుకొచ్చారు. ఆతరువాత ఎప్పుడైనా ఋతుధర్మం ప్రకారం శరీరం స్పందిస్తే, తదనుగుణంగా ఆ కోరికను చల్లార్చుకోవడం మినహా వేరే సమయాల్లో భార్యకి సన్నిహితంగా వచ్చేవాడు కాదతడు.
తనకన్నా వయసులో పెద్దవాడైన కారణంగా ఏర్పడిన భయం ఓపక్క, నవ్వితే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో అన్న రీతిలో ముఖంముడుచుకు ప్రవర్తించే ముద్దుకృష్ణ తీరొకపక్కన..వెరసి ఈ కారణాలచేత రాధ అతడికి మానసికంగా చేరువకాలేకపోయింది.
“ఏంటమ్మా...ఇక్కడేం చేస్తున్నావు? బావేడీ?’’ పాండురంగం స్వరంవిని ఉలికిపడి ఈలోకంలోకి వచ్చిన రాధమ్మ “ఏమోనన్నయ్యా...అలా పొలం వెళ్లారేమో!’’ అంది తడబడుతూ.
“బాగుంది మీ ఆయన వ్యవహారం! రేపు ఇంట్లో సందడి పెట్టుకుని ఇవాళ పొలం వెళ్లకపోతే ఏంపోయింది! వట్టి పెడసరం మనిషి కాకపోతేనూ!’’ముద్దుకృష్ణ సంగతి తెలిసిన పాండురంగం ముద్దుగా విసుక్కున్నాడు.
బదులీయకుండా చిన్నగా నవ్వింది రాధమ్మ.
‘;సరిపోయింది... అతగాడికి తగిన ఇల్లాలివే నువ్వూనూ!’’ మురిపెంగా అంటూ బయటకు వెళ్లిపోయాడు పాండురంగం.
రాధమ్మ బలవంతంగా నవ్వుతూ పనుల్లో చొరబడిపోయింది. చేతులు అలవాటున్న పనులను యాంత్రికంగా చేసుకుపోతున్నాయి. మనసుమాత్రం ఇందాక వీక్షించిన మధురఘట్టాలని మననం చేసుకుంటోంది.
మొగుడుని చనువుగా ‘ఒరేయ్...రారా...పోరా’ అంటూ పిలుస్తూ అల్లుకుపోతున్న ఆముగ్గురమ్మాయిలని చూస్తే ఎంతో సరదాగా అనిపిస్తోంది. ‘తాము మగాళ్లమ’న్న అహంభావం