మొండి 28 సీక్రెట్ ఏజెంట్
telugu stories kathalu novels మొండి 28 సీక్రెట్ ఏజెంట్ అది మే నెల.అందరూ బీ. టెక్ పూర్తి చేసి కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న సమయం. క్యాంపస్ లో ప్లేస్ మెంట్స్ రాని వాళ్ళందరూ రకరకాల కోర్సుల్లో చేరి బిజీ గా తిరుగుతున్నారు. వీరు నెమ్మదిగా రూమ్ ని వెకేట్ చేసి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి అక్కడక్కడా ఉంటూ, తనకు రావలసిన కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని మనస్సు మిగతా అందరి కన్నా కాసింత తృప్తి , కాసింత సందిగ్ధ అవస్థలో కూరుకుపోయి ఉంది.
వీరు మనస్సులో ఉన్న ఒకే ఒక్క వెలితి, దివ్య తో ఫైనల్ సంవత్సరంలో పెద్దగా మాట్లాడే సమయం దొరకకపోవడం. దివ్య తనతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక కారణం వలన వేరే పనిలో పడి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజంగా దివ్య తనని ప్రేమిస్తోందా? లేదా ఎప్పటికీ తనని స్నేహితుడిగానే చూస్తోందా కరెక్ట్ గా చెప్పలేడు.
రాత్రుళ్ళు దివ్య తో మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ , తనకి కాల్ చేస్తే కట్ చేస్తుంది. ఒక్కోసారి మెసేజ్ లోనే బాగా విసుక్కుంటుంది. బాధగా ఉంటుంది.
అలా అనిపించినప్పుడల్లా , చైతన్య చెప్పిన మాటలు మాత్రం గుర్తొస్తుంటాయి, " మనకు రాసి పెట్టి ఉంటే , మనం ఎక్కడికెళ్లినా మనది మనకోసం వెతుక్కుంటూ వస్తుంది " అని. ప్రాజెక్ట్స్ లో వచ్చిన డబ్బులతో చిన్న స్టార్ట్ అప్ కంపెనీ లాంటిది ఒకటి పెడదామని అనుకున్నాడు వీరు. ఎంత ఉద్యోగం చేసినా సొంతగా ఒక కంపెనీ పెట్టిన ఆనందం ఎందులోనూ దొరకదు కదా. పైగా రాజేష్ అన్నట్టు " ఎవరినీ గుడ్డిగా నమ్మి వెళ్ళకు " అన్న మాటలు అతనిని బాగా కాస్త కన్ఫ్యూషన్ లో నెట్టాయి. అలాంటి ఆలోచనల్లో మునిగి