మొండి 14 డార్క్ జర్నీ
telugu stories kathalu novels మొండి 14 డార్క్ జర్నీ అక్కడ నుండి ఆ కాస్త సమాచార తెలుకుని ఎప్పుడైతే రూమ్ కి వచ్చాడో మరో కొత్త గ్రహంలోకి వెళ్లిపోయినంత ఆనందపడిపోయాడు వీరు. నిజం కూడా. ఒక పక్కన హ్యాకింగ్ మెలకువలు, మరొక పక్క దివ్య తో మాట్లాడటానికి కారణం, ఇంకొకటి డార్క్ వెబ్ , దానికి తోడు కొత్త ఉద్యగం. అదృష్టం దరిద్రం తగులుకున్నట్టు తగులుకుంది కదా అనుకున్నాడు వీరు. చిన్నప్పటినుండి తనని అనుకున్నదల్లా చేసేలా ప్రేరేపించింది ఒకే ఒక్క గుణం. అది తన మొండితనం. ఇప్పుడు కూడా, బీ.టెక్ చేరినప్పుడు అస్సలు చేతకాని ఈ కోడింగ్, మొండిగా నేర్చుకునే సరికి ఎక్కడిదాకా తీసుకెళ్లిందా అని అనుకున్నాడు.నెక్స్ట్ రోజు ఆది వారం. ఆఫీసుకి తొందరగా వెళ్లి వచ్చేసాడు. ఫ్రెండ్స్ ఎవ్వరూ రూమ్ లో లేరు. ఒంటరిగా కూర్చుని లాప్ టాప్ ఆన్ చేసాడు. పక్కన డార్క్ వెబ్ గురించి ఎలా బ్రౌసింగ్ చెయ్యాలో ఇందాక తెచ్చుకున్న ఈ-బుక్ ని తెరిచి చూసాడు. మూడు రోజుల పాటు అదే పని.డార్క్ వెబ్ లో కి వెళ్లాలంటే Tor అనే బ్రౌజర్ ని వాడతారు. దాంట్లోకి లింక్ టైప్ చేసేటప్పుడు .com బదులు .onion అని వాడతారు.ఒక్కో గంట ఒక్కో వెబ్సైట్ ఓపెన్ చేసి పలు విషయాలు గురించి తెలుసుకుంటున్నాడు.
డార్క్ వెబ్ లో కూడా లెవల్స్ ఉంటాయి అని తెలుసుకున్నాడు వీరు. లెవల్ త్రీ లో ఉండే సైట్లు వరకూ సామాన్య హ్యాకర్లు ఛేదించగలరు. అక్కడ నుండి 4,5 లెవెల్స్ ని మరీనా వెబ్ అని అంటారు. ఆ లెవెల్ లో సైట్లని హ్యాకర్లు ఎప్పటికీ ఛేదించలేరు. ఎందుకంటే వాటిని క్వాంటం కంప్యూటర్స్ తో నడుపుతారు. అత్యంత ధనవంతుల దగ్గర మాత్రమే అలాంటి కంప్యూటర్స్ ఉంటాయి.ఇకపోతే, ఒక్కో సైట్ లో ఉండే ఘోరమైన పేజీలను చూస్తూ వచ్చాడు. నిజానికి అవన్నీ చూస్తుంటే, ఎవరినైనా చంపాలి అన్న కోరిక, కసి అన్నీ వస్తున్నాయి.వీరుకి తన ఉద్యోగం గుర్తుకు రావడం వలన ఇవేవీ రుచించడం లేదు. ఏదో సినిమాలో విన్నట్టు గుర్తు క్రిమినల్ ని పెట్టుకోవాలంటే