మొండి 9 గూగుల్ బాంబు
telugu stories kathalu novels మొండి 9 గూగుల్ బాంబు
కనుక్కుంటాను అని సమాధానం వీరు నుండి వచ్చింది.
అక్కడున్న ప్రొఫెసర్ మాట్లాడుతూ
" అయితేనే అవుతుందని చెప్పు. లేదంటే లేదు. ఇది ఇంటర్వ్యూ లలో అడిగే ప్రశ్న కాదు. నువ్వు చెప్పే ప్రతి మాటా అక్కడ కొన్ని వందల జీవితాల్ని కాపాడుతుంది"
" యెస్ సర్" అని ఒక రకమైన బెరుకుతో తల ఊపాడు వీరు.
" ఐ మీన్. As soon as possible కనుక్కుని చెప్పు. రెండే రెండు రోజులు ట్రై చేసి అవుతుందో లేదో చెప్పు"
" ఒకే సార్. సార్ నాకో డౌట్"
" ఏంటి? " అని ప్రశ్నించి చూస్తున్నాడు పోలీస్ ఆఫీసర్ మహేష్ దత్.
" అసలు , ఈ మెసేజ్ లో ఏముందో ఆ టెర్రరిస్ట్ ఇంటరాగేషన్ లో ఏమి చెప్పలేదా? మనం అందరం ఇలా బుర్ర బద్దలు కొట్టుకోవడం అవసరం అంటారా?"
చిన్న నవ్వు నవ్వారు అక్కడి వారందరూ
" అతను పట్టుకున్న కాసేపటికే చనిపోయాడు. దానితో మా పని ఆగిపోయింది. ఈ దారిలో ప్రయత్నించి చూసినా సమాధానం దొరకడం లేదు. ఒక్కటే క్లూ ఏంటి అంటే, ఆ మెసేజ్ DM-14637 అనే యూసర్ పేరుతో వచ్చింది. దానిబట్టి ఇలాంటి మెసేజ్ చాలా మందికి వెళ్ళి ఉండాలి. కాబట్టి ఇదొక మాస్టర్ ప్లాన్. "
అంత వరకు చెప్పి ఆగిపోయాడు ఆఫీసర్ మహంతి. ఒక్క సారిగా అక్కడున్న రూమ్ లో నిశ్శబ్దం ఆవరించింది. రేపట్లోపల కనుక్కుంటా అని చెప్పి, బయలుదేరారు వీరు, రవి ఇద్దరూ.
మళ్లీ హాస్టల్ కి చేరుకున్నాక రవి సార్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వీరు.
రూమ్ లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ ఏం కదిలించిన మాట్లాడకాలానే కూర్చొని ఆలోచిస్తున్నాడు వీరు. పక్కనున్న ఫ్రెండ్ లాప్ టాప్ అడిగి తీసుకుని వెతకడం మొదలుపెట్టాడు. ఏదైనా క్లూ దొరుకుందా అని. మామూలుగానే ముందు గూగుల్ మ్యాప్స్ లో ఏమన్నా క్లూ దొరుకుతుందా అని ఆలోచించాడు . కాసేపు అయ్యాక డార్క్ వెబ్ ఓపెన్ చేసి కూడా వెతికి చూసాడు. కానీ , గూగుల్ మ్యాప్స్ లోని లొకేషన్ నే అతను ఎందుకు డైరెక్ట్ గా పంపించాడు. అంటే , అక్కడ ఆ లొకేషన్ ని మించిన సమాచారం ఏమన్నా ఉంటుందా ? ఇలా బుర్ర మొత్తం