అమ్మాయి ప్రేమ పరిణయం 34
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 34 ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మంచం మీద వాలాడు. ఎంత సేపు ప్రయత్నించినా అతనికి నిద్ర రావడం లేదు. ఇందాక రెస్టారెంట్ లో జరిగిన సంఘటనలే మనసులో మెదుల్తున్నాయి. ఆ అమ్మాయి విషయం లో తొందరపడ్డాడని అతని మనసుకి తెలుసు. అందుకే సరిగ్గా నిద్ర పట్టట్లేదు. "ఛ అసలు ఏమయింది నాకివాళ. అలా ఎలా బ్యాలెంస్ తప్పాను. ఎప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ లోనూ బ్యాలెంస్ తప్పని నేను ఈ అమ్మాయి విషయం వచ్చేసరికి బ్యాలెంస్ తప్పుతున్నాను. నోటికొచ్చినట్టలా ఆ అమ్మాయిని తిట్టేసాను. పొద్దున్న జరిగిన దానికి ఆమెని బాధ్యురాలిని చేసాను. పాపం ఇక్కడ ఇంట్లో జరిగిన విషయాలు ఆ అమ్మాయికి ఏం తెలుసని. తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి అతన్ని అలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. ముక్త మొహం లో ఉన్న ఆశ్చర్యమే అతనికి పదే పదే గుర్తు వచ్చి నవ్వు వస్తోంది." ఆమెని అలా అనడం తప్పని తెలుస్తోంది గానీ ఎందుకో ఆ అమ్మాయికి సారి చెప్పాలని మాత్రం అనిపించట్లేదు. ఎందుకో మనసు కొంచం కుదుటపడినట్టు అనిపించింది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్ర లోకి జారుకున్నాడు
మరుసటి రోజు ఉదయం ఆగకుండా అదే పనిగా ఫోన్ మోగడంతో బద్దకంగా కళ్ళు తెరిచాడు యశ్వంత్. నిన్నంతా ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టక ఆలశ్యంగా నిద్ర పోవడంతో పొద్దున్నే మెలుకువ రాలేదు. ఫోన్ చేతిలోకి తీసుకొని చూసాడు. కాల్ చేస్తోంది సంజయ్. "వీడేంటి ఇంత పొద్దున్నే కాల్ చేస్తున్నాడు" అనుకుంటూ ఫోన్ ఎత్తి "చెప్పరా ఏంటి ఇంత పొద్దున్నే" అన్నాడు
"బాంబే నుండి మానేజర్ కాల్ చేసాడు రా. అక్కడ క్లైంట్ తో ఏదో ఇష్యూ ఉందంట." అన్నాడు సంజయ్
ఆ మాటతో ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యాడు యశ్వంత్. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా "డిటైల్స్ చెప్పు" అన్నాడు సీరియస్ గా
యశ్వంత్ చాలా సీరియస్ గా ఉన్నాడని అర్ధం అయ్యింది సంజయ్ కి నిన్న రాత్రి తనకి ఫోన్ చేసినప్పుడు బాంబే మానేజర్ అతనికేం చెప్పాడో అదే విషయం యశ్వంత్ కి చెప్పాడు సంజయ్.
"ఈ విషయం నీకెప్పుడు తెలిసింది" అన్నాడు యశ్వంత్
"నిన్న నైట్ రెండింటికి కాల్ చేశాడు"
"మరి నువ్వు నాకు ఇప్పుడా కాల్ చేసేది" అని సీరియస్