అమ్మాయి ప్రేమ పరిణయం 28
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 28 "అంటే ఇప్పటిదాకా నేను చెప్పిందేది వినలేదా"
"అబ్బా సారీనే ఏదో ఆలోచిస్తూ ఉన్నా..చెప్పు చెప్పు ఏంటి"
"నేనేం చెప్పను. నీ ఆలోచనల్లో నువ్వుండు"
"అబ్బా సారీ అన్నా కదా. ఇంతకీ విషయం చెప్పు"
"ఇవాళ సాయంత్రం మూవీకెళ్దామా"
"ఇవాళ నేను ఊరెళ్తున్నా"
"అవునా...మరి చెప్పలేదు"
"నువ్వు నిన్న ఆఫీస్ కి వచ్చావా అసలు"
"ఓ..అవును కదా.."
"ఈ సారి ఎప్పుడైనా వెళ్దాం లే" అంది ముక్త
"సరే"
ఇద్దరూ లంచ్ ఫినిష్ చేసి ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తన సీట్లోకి రాగానే సంజయ్ కోసం వెతికింది ముక్త. అతనెక్కడా కనబడలేదు. సంజయ్ కాల్ చేసి విషయం కనుక్కుందాం అనుకుంది కానీ అతన్ని మరీ తొందరపెట్టినట్టు ఉంటుందని ఊరుకుంది. ఎలాగైనా సర్దుతా అన్నాడుగా చూద్దాం పొద్దున్నే చెప్పి మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తే ఏం బావుంటుంది మరీ వెంటపడినట్టు ఉంటుంది. సాయంత్రం దాకా ఓపిక పడదాం అనుకుంది.
సంజయ్ ముక్త అడిగిన దాని గురించే ఆలోచిస్తున్నాడు అంత సడెంగా అయిదు లక్షలు అదీ క్యాష్ లో కావాలంటే కష్టమే. తన దగ్గర కూడా అంత ఎమౌంట్ లేదు. మహా అంటే రెండు లక్షలు ఉన్నాయేమో. నాన్నని అడుగుదామంటే ఆయన ఊళ్ళో లేరు రావడానికి ఇంకో రెండు రోజులు పడుతుంది. ఎవరినైనా ఫ్రెండ్స్ ని అడగాల్సిందే. అయినా ఎవరినో అడగడం ఎందుకు యశ్ ని అడిగితే సరిపోతుందిగా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతని క్యాబిన్ కెళ్ళాడు. అది ఖాళీగా కనిపించింది. ఇదేంటి వీడింకా రాలేదా ఇవాళ..అయినా అప్పుడే పదకొండవుతోంది ఇంత లేట్ గా ఎప్పుడు రాడే అనుకొని రాఘవరావు గారిని అడిగాడు "ఇవాళ సర్ రాలేదా..లేకపోతే ఏదైనా పని ఉందని బయటకి వెళ్ళారా"
"ఆయన ఇవాళ రాలేదు రానన్నారు."
"ఓ..అవునా..ఎందుకో మీకేమైనా తెలుసా..అంటే ఏదైనా ఊరెళ్తానని ఏమైనా చెప్పారా"
"లేదు సంజయ్ నేను అడగలేదు..నీకు తెలుసు గదా ఆయన చెప్పిందే మనం వినడం తప్ప ఆయన్ని మనమేం అడగలేమని" అని నవ్వాడు
"అదీ నిజమేలే..సరే" అని చెప్పి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక సంజయ్ ఆలోచనల్లో