పెళ్ళాం సోదరీ 2
telugu stories kathalu novels పెళ్ళాం సోదరీ 2అతను చెప్పిన మాటల్ని విని షాకైపోయి నోట మాట రానట్టు అలాగే నిలబడి పోయారు రమణమూర్తి ఆయన భార్య సుశీల…అదేమీ పట్టనట్టు అతను చెప్పుకుంటూ పోతున్నాడు. ”నా పెళ్ళై రెండు సంవత్సరాలవుతోంది… అప్పటి నుండి మీరు కట్నం డబ్బులు ఇవ్వడం కోసం వాయిదాలు వేస్తూనే ఉన్నారు. నేను కూడా ఎన్నాళ్ళని ఓపిక పట్టను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ నిర్ణయానికి సమ్మతించి ఒప్పుకున్నట్లయితే నేను చెప్పే విధంగా నడుచుకోండి లేదంటే నాకివ్వాల్సిన డబ్బులని ఇప్పుడే ఇచ్చేయండి…. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి… మీరు లేటు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుంది…” హెచ్చరించినట్లుగా అన్నాడు వినోద్ వారి వైపు కోపంగా చూస్తూ….రామణమూర్తికి నోరు పెగలడం లేదు. అతని పరిస్థితి ముందు నుయ్యి. వెనుక గొయ్యిలా అయిపొయింది. రెండు సంవత్సరాల క్రితం తన పెద్ద కూతురు శ్వేత పెళ్ళిని ఎంతో ఆర్భాటంగా చేసాడు… నాలుగు లక్షల కట్నం కుదుర్చుకున్న రమణ మూర్తి పెల్లిరోజునే రెండు లక్షల రూపాయలని వినోద్ కి ముట్ట జెప్పాడు. ఇంకో రెండు