ఇదీ కధ 14

By | November 26, 2019
telugu stories kathalu ఇదీ కధ 14 "ఆ డాక్టర్ ఫ్రాడ్! నువ్వంత కంటే ఫ్రాడ్?" "సాగర్ బాబూ!' అర్దర్లీ విక్టర్ అడిరిపోయాడు. "విక్టర్ ! నువ్వూరుకో! వాడిష్టమొచ్చినట్టు అననీయ్" నెమ్మదిగా అన్నాడు సాంబశివరావు. సాగర్ కు ఎక్కడో తోడేళ్ళు, నక్కలు మూలిగినట్టయింది. "ఇంకా అంటాను! మీరిద్దరూ తోడేళ్ళు, గుంట నక్కలు!" వెర్రిగా అరిచాడు సాగర్. 'సాగర్ బాబూ! మీరేం మాట్లాడుతున్నాడో తెలుసా?" లేచి కోపంగా అన్నాడు విక్టర్. "వాడెం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. నువ్వురికే వుండు?" సాంబశివరావు విక్టర్ ను వారించాడు. విక్టర్ "యస్సార్" అంటూ తండ్రి కొడుకుని మార్చి మర్చి చూస్తూ నిలబడ్డాడు. "నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు ! ఆ డాక్టరూ నువ్వు కలసి ఏం చేస్తున్నారో నాకంత కంటే బాగా తెలుసు! ఇక మీ ఆటలు సాగానివ్వను. అది మాత్రం గుర్తుంచుకోండి! సాగర్ విసురుగా వెళ్ళిపోయాడు. తన గదిలోకి వెళ్ళి తలుపులు దబెలున మూసుకున్నాడు. సాగర్ అలా గదిలోకి వెళ్ళగానే సాంబశివరావు టక్కున లేచి నిలబడ్డాడు. విక్టర్ అయోమయంగా బాస్ ను చూశాడు. "విక్టర్! వాడికి వంట్లో బాగాలేదు. వాడ్ని కనిపెట్టి వుండు! ఒకవేళ వాడు బయటికి వెళితే వాడిని అంటి పెట్టుకొనే వుండాలి. వీలైనంత వరకూ వాడు బయటికి వెళ్ళకుండా చూడు! వాడి మతాలకేం అడ్డు చెప్పవద్దు!" 'అలాగే సర్!" "చూడు! అవసరమయితే నాకు ఫోన్ చెయ్యి డాక్టర్ మూర్తి దగ్గరుంటాను" "యస్సార్!" సాంబశివరావు పోర్టికోలో ఆగి వున్న జీప్ ఎక్కాడు. విక్టర్ శాల్యుట్ కొట్టి నిలబడ్డాడు. జీప్ గేటు దాటి పోగానే విక్టర్ బుర్ర పనిచేయటం మొదలు పెట్టింది. తండ్రి ముందు పెదవి విప్పి మాట్లాడని కొడుకు యీ రోజు ఇట్లా ఎలా మాట్లాడ గలిగాడు! బిడ్డయినా సరే , తల్లయినా సరే తనకు ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళను కాలి కింద నలిపేసే సూపర్నెంటు గారు యీ రోజు ఎందుకు పిల్లిలా అయిపోయారు? సాగర్ బాబుకు వంట్లో బాగా లేదన్నాడు? వంట్లో బాగాలేకపోతే ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తాడు సాగర్ . వంట్లో కాదు అసలు అబ్బాయికి తల్లోనే బాగొలేదేమో? ఆ మాట చెప్పలేక అయ్యగారూ ఇలా చెప్పారు. తన ఆలోచన సరయిందే! అబ్బాయిగారి చూపులూ, మాటలూ - అన్నీ అవే అవే .... ఆ లక్షణాలే!--- విక్టర్ ఖంగారు పడ్డాడు. సెంట్రీ డ్యూటీ గదిలో వున్న గన్ తీసి దగ్గర పెట్టుకొన్నాడు. ఇంకేమయినా ఉందా? ఆ పిచ్చాబ్బాయి చేతికి గన్ దొరికిందంటే? వరుస పెట్టి పట్ పట్--- విక్టర్ కు ముచ్చెమటలు పోశాయి. సాగర్ బాబు గదిదగ్గరకు వెళ్లి చూడాలని పించింది. కాళ్ళు వణికాయి. అడుగు ముందుకు పడలేదు. అక్కడే నిలబడి సాగర్ గదికేసి చూడ సాగాడు విక్టర్.       14 'అనుకున్నంతా అయిందన్నమాట!" 'అవును డాక్టర్! మీరూ ఊహించినట్టే జరిగింది." 'ఊహించడం గాదు! మెదడు చాలా సున్నితమైనది. మీవాడి ధోరణి, ఇన్ వాల్వ్ మెంట్ చూసి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకున్నాను" డాక్టర్ టేబుల్ ముందు నిలబడి వున్న సాంబశివరావు వైపు చూస్తూ అన్నాడు. సాంబశివరావు కుర్చీ లాక్కుని డాక్టర్ మూర్తి ఎదురుగా కూర్చున్నాడు. "మీరు ముందే వార్నింగ్ ఇచ్చారు. పరిస్థితి ఇంత విషమిస్తుందనుకోలేదు. ముందే జాగ్రత్తపడితే బాగుండేది" సాంబశివరావు సాలోచనగా అన్నాడు. 'జాగ్రత్తపడి మాత్రం ఏం చేయగలిగే వాళ్ళు! మాధవి నుంచి సాగర్ ను దూరం చేయగలిగే వాళ్ళేనా?" సాంబశివరావు అసమర్ధతను ఎత్తి పొడుస్తూ అన్నాడు డాక్టర్ మూర్తి. "కాళ్ళూ చేతులు కట్టి ఇంటిలో పడేసేవాడ్ని?" "అవి పోలీసు వాడి మాటలు! అనుమానం ఉన్న వాడి నల్లా లాకప్ లో వేసి ఉతకడానికి సాగర్ ఏమన్నా బయటి వాడా? కన్నకొడుకు." "కన్నకొడుకుని మెత్తగా ఉండబట్టే చెయ్యి జారిపోయింది. ఇప్పుడెం చేయాలో తోచడం లేదు!" బాధగా అన్నాడు సాంబశివరావు. "డోంట్ వర్రీ! సాగర్ ను బాగుచేసే బాధ్యత నాది!" డాక్టర్ హామీ ఇచ్చాడు. పోలీసాయనకు డాక్టర్ మీద నమ్మకం కుదిరినట్టు లేదు. "చెప్పను కదా! వాడి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా వున్నది. వాడా మాధవినే చేసుకుంటా నంటున్నాడు. పెళ్ళి చేస్తే గాని పిచ్చి కుదరదంటారు. పిచ్చిదో ఎచ్చిదో ఆ మాధవినే కట్టబెడితే ఏమన్నా బాగుపడతాడేమో/ ఆశగా వున్నది" సాంబశివరావు రాజీ మార్గంగా అన్నాడు. "అలా అయితే మంచిదే! ఆ పిచ్చిదాన్ని సాంగత్యం తోనే సాగర్ కు సగం మతి పోయింది .కదా. ఇహ దాంపత్యం చేస్తే ఉన్న మతి కూడా పోదని నమ్మకం ఏముంది? ఇది సాగర్ భవిష్యత్తు కు సంబంధించిన

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *