అర్దరాత్రి ఆడపడుచులు 7

By | November 26, 2019
telugu stories kathalu అర్దరాత్రి ఆడపడుచులు 7 నువ్వే నా కిష్ణయ్యా! నీ దగ్గరికే వచ్చారా ఈ పోర్లు?" "ఆడ? డైరెక్టుగా నా దగ్గరికే వచ్చారు! రాక ఇంకెక్కడి కెళ్తారు మరి?" అన్నాడు కిష్ణయ్య. అతను ఆ ఇంటికి కాపలా కుక్కలాంటివాడు. బయటనుంచి ముసల్ది పెడుతున్న శాపనార్ధాలు వినబడుతున్నాయి. అప్పుడు మొదటిసారిగా గుర్తువచ్చింది సృజనకి. ఆ ముసలిది విసిరిన రోకలి తగిలినచోట తొడమీద కదుపుకట్టిందని. "ఈళ్ళంతా ఏరీ? లాటుగా అందర్నీ పట్టుకెళ్ళిపోయాడా ఇన్స్ పెక్టర్ సాబ్?" అన్నాడు కిష్ణయ్య. "వదుల్తాడూ? అందర్నీ పట్టుకు పోయాడు రాక్షసుడు! ఇక్కడ ఇంకా రంగేలీ మిగిలింది. నేను మిగిలాను. ఈ పిల్లల పని పట్టడానికి" అన్నాడు ఒకతను వాళ్ళదగ్గర్కివస్తూ, అతని పేరు ఉస్మాన్ అక్కడ నిత్యం జరిగేగానా బజానాలో     ఢోలక్ వాయిస్తాడు. నెంబర్ వన్ శాడిస్టు అతను. ఆ ఇంటికి కొత్తగా తేబడ్డఆడపిల్లల మనోస్థయిర్యాన్ని నీరుకారిపోయేటట్లు చేసి, బానిసలుగా మార్చే చాకచక్యం అతనికి ఉంది. ఆ ఇంట్లో ఉన్న టార్చర్ ఛాంబర్ కి అధిపతి అతను. "ఏంపిల్లలూ? పారిపోగలమనుకుంటున్నారా ఏమిటి? ఢోలక్ వాయించినట్లువాయించి పారేస్తా! ఖబడ్దార్!" అన్నాడు గుడ్లురుముతూ. కిష్ణయ్య పెద్దగా నవ్వాడు. రంగేలీకలగజేసుకుంది. "కొత్తపిల్లలులే ఉస్మాన్! నలుగు రోజులుపోతే వాళ్ళే మెత్తబడిపోతారు! పోనియ్!" "ఆ రెండోపిల్ల మెత్తబడుతుందేమోగానీ, ఈ పిల్ల ఉంది చూడు" అని సృజనని చూపించాడు ఉస్మాన్ "ఇది పొగరు బోతుగుర్రం! నాలాంటి వాడు స్వారీ చేస్తేగానీ ఇలాంటిగుర్రాలు మచ్చికకావు. ఏమంటావ్! నడవ్వే పిల్లా!" "వద్దు ఉస్మాన్! పిల్ల మరీ లేతగా ఉంది. దాన్ని హింసించకు!" అంది రంగేలీ గాభరాగా. "పిల్ల చచ్చి ఊరుకుందంటే కష్టం!" "పోపోలేపోనే ఆఠ్! (కొజ్జా) నువ్వునాకు చెప్పేదేమిటి? రావే పిల్లా!" అన్నాడు ఉస్మాన్. భయంతో రక్తం గడ్డకట్టినట్లయిపోయింది సృజనకి కదలకుండా నిలబడి పోయింది తను. తీవ్రంగా చూసి, ఆమె పొడుగాటిజడని అందుకున్నాడు ఉస్మాన్. "నడవ్వే!" బాధభరించలేకతల వంకరగా పెట్టింది సృజన. వేళ్ళాడిపోతూ అతని వెంట నడిచింది. రెండో చేత్తో కామాక్షిని లాక్కెళ్ళాడు ఉస్మాన్. ఆ గది గోడలనిండా భయాత్పాతాన్ని కలగజేసే చిత్ర విచిత్రమైన ఇస్ స్ట్రుమెంట్సు తగిలించి ఉన్నాయి. వాటివైపు ఇష్టంగా చూసుకున్నాడు ఉస్మాన్. వాటిలోనుంచి ఒక పరికరాన్ని సెలెక్టు చేసుకుని, చేతుల్లోకి తీసుకున్నాడు. పెద్దసైజు కాకరకాయలా ఉంది అది. కాకరకాయకు బుడిపెలు ఉన్నట్లు ముళ్ళుముళ్ళుగా ఉందిదాని ఉపరితలం అంతా. ఇనపముళ్ళు! "వద్దురా సైతాన్ కీ ఔలద్! పోరిచచ్చిపోతుంది." అంది రంగేలీ బయటనుంచి కంగారుగా. "నేనసలే పోలీసోన్ని! హత్యలు చూడకూడదు" అంటూ కొంచెం ఎడంగా వెళ్ళినిలబడ్డాడు కానిస్టేబులు కిష్ణయ్య. పిశాచంలా నవ్వాడు ఉస్మాన్. నెమ్మదిగా కిటికీలో నుంచి చెయ్యి బయటికి చాపాడు. అక్కడ ఒక బొప్పాయి చెట్టు ఉంది. అందుబాటులోనే ఒక కాయలో వేలాడుతోంది దానికి. ఆకాయను తెంపాడు ఉస్మాన్. గుడ్లు గుండ్రంగా తిప్పుతూ సృజనవైపూ కామాక్షి వైపూ భీకరంగా చూసి, ఇనపకాకరకాయ బొప్పాయి కాయలోగుచ్చి ఒక్కసారిగా మెలిపెట్టాడు. ఆబొప్పాయి కాయకే గనక నోరు ఉంటే, అది దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం చేసి ఉండేది. అది చూడగానే, గజగజవణకడం మొదలెట్టారు సృజనా, కామాక్షి. ఎక్కడో తొలికోడి కూసింది. సుప్రభాతాన్ని సూచిస్తూ ఉత్సాహంగా కూసిన కూతలాగా లేదది. మేడమీద వేటుపడేముందు, మరణమాసన్న మైందని ఆలస్యంగా గురించి పెట్టిన చావుకేకలా ఉంది ఆ కూత. "ఇట్రా!" అన్నాడు ఉస్మాన్. విహ్వలంగా చూసింది సృజన. నవ్వాడు ఉస్మాన్. అతనికి అది ఆటలాగా ఉంది. క్రూరమైన ఆట. ఒక్క అడుగు వెనక్కి వేసింది సృజన. నవ్వుతూ కొంచెం ముందు నడిచాడు ఉస్మాన్. అతడు ఇప్పుడు అచ్చం రాఘవులులా కనబడుతున్నాడు సృజనకి. భయంగా మరి రెండు అడుగులు వెనక్కి వేసింది సృజన. ఆమె వీపుని అడ్డగించింది గోడ. నిస్సహాయంగా నిలబడి పోయింది తను. ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఉస్మాన్. రెండుచేతులూ జోడించింది సృజన. "ప్లీజ్! నాకు భయమేస్తోంది! నన్ను వదిలెయ్యవా? ప్లీజ్!" విరగబడి నవ్వాడు ఉస్మాన్. చెయ్యి ముందుకు జాపాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది సృజన. ఫెడేల్మని తలుపు తీసినచప్పుడైంది.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *