నా ఇల్లాలి ఫ్యామిలి 71
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 71 చెల్లెమ్మా , అమ్మాయి చిన్నప్పటినుంచీ బయటే పెరిగింది . కనీసం తనకోసం వచ్చేవాళ్లు ఉంటారు ఎవరైనా అన్న నమ్మకం కూడా కోల్పోయి ఉంటుంది . మొదటిసారి మీరు వెళ్తే కంగారుతో లేదా కోపంతో రాను అని చెప్పవచ్చు . అందుకే ఇది తన కోసం తీసుకెళ్లు , మన ఇంటిలోకి అడుగు పెడుతున్న మహాలక్ష్మిని బంగారంతో ఆహ్వానించాలి , ఆ తరువాత మన ప్రేమని పంచాలి . తనకి ఇలా ఐనా మనం తనవాళ్లం అని తెలుస్తుంది ”నేను చెప్పిన మాటలు నా చెల్లెలి నోటి వెంట విన్న నా కూతురు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టుకొని ఉండిపోయింది . అది చూసిన నా చెల్లెలు“సరిగ్గా అన్నయ్య చెప్పినట్టే జరిగింది , అందుకే రెండవసారి నీకిమ్మని దుద్దులు ఇచ్చి పంపాను నేను . అప్పటికి వాటిల్లో ఉన్న రాళ్ళు చూసి మురిసిపోయి ఉంటావు , కానీ నిజంగానే నీకు ఇచ్చినవి మేలిమి బంగారపు దుద్దులు ”సరిగ్గా తను మనసులో అనుకున్నట్టే చెప్పింది అత్తయ్య కానీ అది ఆడవాళ్ళ విషయం కాబట్టి సరే , కానీ తనతో పరిచయం లేని బాబాయి అలా తను