వంశాచారం 49
naa telugu kathalu వంశాచారం 49 తెప్ప చేరుకోగానే భద్రుడు తన చేతిలో వున్న తెడ్డు తో సుబ్బమ్మ తల మీద బలం గా కొట్టి నీటిలో పడిపోయేలా చేసాడు .ఊహించని ఈ పరిణామం తో సుబ్బమ్మబాధతో అరుస్తూ నీళ్లలో పడి ప్రవాహం తో పాటుగా కొట్టుకెళ్ళి ఒక సుడిగుండం లో చిక్కుకొని మునిగిపోయింది. సుబ్బమ్మ ఆ విధం గా సుడిగుండం లో పూర్తిగా మునిగిపోవడాన్ని ధ్రువపరుచుకొని తన లక్ష్యం వైపుకి తెడ్డు ని వేస్తూ తెప్పను వాటం గా ముందుకు తీసుకెళ్ళసాగాడు. ఎన్నో అవాంతరాలను దాటుకొని భద్రుడు ఎట్టకేలకు ఆ నది ఆవల వైపుఒడ్డు కి చేరుకోగలిగాడు.ఇప్పుడు ఆ నది తన ప్రవాహ పరిధిని పెంచుకొని ప్రవహిస్తూ ఉండటం తో సాధారణం గా తెప్ప నిలిపే చోటు ను ధాటి ఆ ఒడ్డునున్న ప్రాంతమంతా నీళ్లతో నిండిఆ ప్రవాహానికి కొట్టుకొచ్చి తేలియాడుతున్న తాటి చెట్టు మొదళ్ళు మరియు చెత్త చేదరాలతో నిండి పోయి వుంది.తెప్పను ఒడ్డుకు తీసుకెళ్లలేని స్థితిలో అక్కడే నీళ్లలో తేలుతున్న తాటి చెట్టు కి డీ కొట్టి నిలిపి తెప్ప నుంచి