వంశాచారం 8
naa telugu kathalu వంశాచారం 8 అత్తగారి ఇంటినుంచి వెళ్లిన గజేంద్రుడు నేరుగా తనఇంటికి చేరుకున్నాడు . అక్కడ తన ఇంట్లో చాలాకాలంగా నమ్మకంగా పనిచేసే నారయ్య తలుపులు తీసాడు.
బాబుగారు మీ కోసం అమ్మగారు వేచిచూసి గదిలోకి వెళ్లారు, మీరు వస్తే భోజనం చెయ్యమన్నారు.
సరేలే నారయ్య నువ్వు ఇక తోటకువెళ్ళు .. పొద్దున్న నేను పొలంకి వస్తాను అని చెప్పి వాడిని పంపేశాడు.
నారయ్య భార్య సుమతి.ఆమెకి ఎనిమిది మంది సంతానం కలిగిన కానీ పుట్టినవారిలోఅయిదు మంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారు. ఇప్పుడు ముగ్గురే మిగిలారు.వారిలో పెద్దవాడు కాముడు.
వయసులో చిన్నవాడైనా చెడు సహవాసాలు,తల్లితండ్రుల పట్టింపు లేకపోవడం వలన చాలా చెడిపోయాడు. వాడికి లేని చెడు అలవాటు ఉండేది కాదు. సారాతాగుడు,చుట్టలు కాల్చడం చేసేవాడు. డబ్బుల కోసం