రాజ్య సింహాసనం 18
రాజ్య సింహాసనం 18 ప్రభావతి ఒంటి నుండి వస్తున్న సుగంధపరిమళాలు ఆదిత్యసింహుడిని వివశుడ్ని చేస్తున్నాయి.“ఏంటిది యువరాజా….మరీ మీరు చనువు ఎక్కువ తీసుకుంటున్నారు…ఎవరైనా చూస్తే ప్రమాదం,” అంటూ తన మీదకు ఒంగి పెదవులను అందుకోబోతున్న ఆదిత్యసింహుడి ఛాతీ మీద చెయ్యి వేసి ఆపడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆదిత్యసింహుడు ఆమె మాటలు వినకుండా నడుము మీద ఉన్న తన చేత్తో ఆమెను ఇంకా దగ్గరకు లాక్కుని ప్రభావతి ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.
మొదటి సారి తన పెదవుల మీద ఒక మగాడి పెదవుల స్పర్శ తగిలేసరికి ప్రభావతి కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి.
ఆదిత్యసింహుడి కళ్ళల్లోకి చూస్తూ, “యువరాజా….ఏంటి ఈ ధైర్యం…వివాహం కాకుండా ఇలా చేయడం భావ్యం కాదు …నా గురించి కొంచెం ఆలోచించండి,” అంటూ ప్రభావతి సిగ్గు పడింది.
“కాని మీ అందం చూస్తుంటే….నాకు మనసాగడం లేదు యువరాణీ…మరి మాతో వివాహానికి మీరు ఒప్పుకున్నట్టేనా,” అనడిగాడు ఆదిత్యసింహుడు.
“మీ మీద ఇష్టం లేకపోతే ఇంత చనువుగా ఎందుకుంటాను యువరాజా…” అంటూ ప్రభావతి సిగ్గుపడుతూ ఆదిత్యసింహుడికి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తున్నది.
ప్రభావతి ఇబ్బందిని గమనించిన ఆదిత్యసింహుడు ఆమెను వదిలి అక్కడే ఉన్న ఆసనంలో కూర్చుని, “మరి మీ తండ్రి గారిని సంప్రదించమంటారా….” అన్నాడు.
ప్రభావతి కూడా ఆదిత్యసింహుడి పక్కనే ఆసనంలో కూర్చుంటూ, “మీదే ఆలస్యం…నాకు సమ్మతమే,” అంటూ తల వంచుకున్నది.
“మరి ఇప్పుడే వెళ్ళి మీ తండ్రిగారితో మాట్లాడతాను….” అంటూ ఆదిత్యసింహుదు ఆసనంలో నుండి లేచి వెళ్ళబోయాడు.
ఆదిత్యసింహుడి తొందరపాటుకి ప్రభావతి నవ్వుకుంటూ, “ఇప్పుడు సమయం కాదు యువరాజా….అయినా ఇంత తొందర ఏల…మా తండ్రిగారు నిద్రలో ఉంటారు,” అంటూ ఆదిత్యసింహుడి చేయి పట్టుకుని ఆపింది.
“తొందర ఉండదా రాకుమారీ….ఇంత అందాల రాశిని ఎంత తొందరగా వివాహం చేసుకుని నా అంతఃపురానికి రాణిని చేద్దామా అని నా మనసు తహతహలాడుతున్నది,” అంటూ ఆదిత్యసింహుడు మళ్ళీ ప్రభావతి పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతున్నాడు.
కొద్దిసేపటి తరువాత ఆదిత్యసింహుడు, “నేను మీకు పరిచయం అయ్యి ఒక్క రోజు కూడా కాలేదు….అంతలోనే నా మీద మీకు ఇంత ఇష్టం ఎలా వచ్చింది,” అనడిగాడు.
ప్రభావతి చిన్నగా నవ్వుతూ, “మిమ్మల్ని