నా తండ్రి ఓటమి చెందినా ఊరికి తిరిగి వెళ్ళి అక్కడ కూడా గెలవాలని నిర్ణయించుకున్నా నేను నా కుటుంబం అక్కడ బాగా స్థిరపడిన నన్ను చూసి అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యంగా చూసారు
ఒక అందమైన భార్య ఇంకా 6 సంవత్సరాల అందమైన కుమార్తె ఇంకా 4 సంవత్సరాల తెలివైన కుమారుడు. నా 30 సంవత్సరాల జీవితంలో పట్టణంలో నాకన్నా ధనవంతులు ఎవరూ లేరు లేదా నాకన్నా అందమైన కుటుంబం ఇంకోటి లేదు.
ఇప్పటి కాలంలో నేను ఈ ఊరి ప్రజలకు నా అసలు పేరు శరత్ కంటే పెద్ద బట్టల షాప్ యజమాని గా పిలువబడ్డాను.
ఊరిలో నా పెద్ద క్లాత్స్ షాప్ ప్రజల్లో నాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మీరా క్లాత్ స్టోర్స్ అని ఎంతో పేరు గడిచింది
ఆ ఊరి ఆలయ వేడుకల్లో నేను ప్రముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాను
నాకన్నా చాలా పెద్దవారు కూడా నన్ను చాలా గౌరవంగా చూస్తారు ఊరిలోని ప్రముఖంగా ఉండే వ్యక్తులు తమ కుటుంబాలలో ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు నాకు మొదటి ఆహ్వానం