శృంగార నగరం 24
ఆమెకు విషయం తెలుసు కాబట్టి ఏమీ ఎదురుమాట్లాడక చిరునవ్వు నవ్వింది ధాన్య.
అంత అజ్ఞానాన్ని చూసి భరించడం కష్టమైనట్లు వర్ష అటూ ఇటూ కదిలింది.
సరిగ్గా ఆ సమయంలో మోహన తనవైపు చూడడంతో ఇక ప్ర్రారంభించమన్నట్లు వెంకట్రామయ్య కన్నుగీటాడు. ఇందుకోసమే కాచుకుని వున్న ఆమె తన ఊపును మరింత ఎక్కువ చేసింది.
జనం చూపంతా ఆమెవైపు మళ్ళింది. నరుడు, గోపాలకృష్ణ కూడా కళ్ళను అటు నిలబెట్టారు.
మోహన అలా వూగుతూనే లేచి నిలుచుంది. జనమంతా టెన్షన్ తో అటే చూస్తున్నారు.
పులిరాజు మరికొంత ముందుకొచ్చి గొంతు పెంచాడు. అతను ఆమెవైపు తీక్షణంగా చోసోతూ "ఎంత ధైర్యమే నీకు? ఇదిగో ఈరోజు నిన్ను వూరికే వదిలిపెట్టను. సప్తసముద్రాలకవతల నిన్ను బంధించి, నీ అంతు తేలుస్తాను" అని ఘీంకరించాడు.
ఈ హెచ్చరిక అంతా దెయ్యానికనీ మొహనకు కాదని, ఇక ఆ క్షణం నుంచి దెయ్యమే ఆమెను నడిపిస్తుందని జనానికంతా తెలుసు. అందుకే వాళ్ళు భయం భయంగా ఆమెవైపు గుడ్లప్పగించి చూస్తున్నారు.
ఆమె మెల్లగా పెదవులను కూడదీసుకున్నట్టు కలిపి "రేయ్ డింభకా! నీవల్ల ఏమోతుందిరా? నేనెవర్ని అనుకున్నావ్? కామినీ పిశాచిరా నిన్ను నిలువునా చీల్చి నీ రక్తం తాగడానికే వచ్చానురా" అని కసిగా అంది.
అతను కళ్ళు మూసుకుని, ఏదో స్మరించి ముక్తాయింపుగా వేపమండలను విదిలించాడు.