యువరాజు 17
telugu sex stories rebus-dm.ru యువరాజు 17 ఉదయం ఉమాదేవి లేవడం లేటైంది... తను లేచే సరికే సుమతి పైన ప్రిన్స్ కి, కింత ఉమాదేవి ఇంట్లో కూడా చకచకా అన్నీ పనులు చేసేయడంతో ఉమాదేవి సుమతిని మెచ్చుకుని తను కూడా స్నానం చేసివచ్చి సుమతి, ఉమాదేవి కలిసి టిఫిన్ తినడం మొదలుపెట్టారు. ఉమాదేవి ‘‘ఏంటే మీ బాసు టిఫిన్ పెట్టలేదా? ఇక్కడ తింటున్నావ్’’ అంది. ‘‘లేదమ్మగారూ అబ్బాయ్ గారు పొద్దున్నే వాకింగ్ వెళ్ళి వచ్చేప్పుడు బ్రెడ్డు జామ్ తెచ్చుకున్నారు... రాత్రి మనం చూశాం కదా దాని మీద వాటినే కాల్చుకుని తిన్నారు... నన్నూ తినమన్నారు గానీ... నాకెందుకో అవి చూడడానికే మాడిపోయిన రొట్టెల్లా కనబడేసరికి తిననని చెప్పేశా’’ అంది సుమతి. ‘‘ఉత్త బ్రెడ్ తిన్నాడా? అదేంటే మరి నువ్వు టిఫిన్ చేస్తానని చెప్పలేదా?’’ అంది ఉమాదేవి (ఓ విధంగా ఉమాదేవికి కోపంవచ్చింది). ‘‘అడిగా అమ్మగారు నిజంగా ఒట్టు... నేను పొద్దున ఆరింటికే లేచి వెళ్ళే సరికి పైన అబ్బాయిగారు కసరత్తులు చేస్తున్నారు... రోజూ పొద్దున ఐదింటికే లేస్తారంట... నేను వెళ్ళేసరికే బాబు గారు పాలు, గుడ్లు, బ్రెడ్, జ్యూసు అన్నీ తెచ్చి అక్కడ పెట్టారు. పొద్దున్నే గుడ్డు, జ్యూస్ తాగుతారంట గుడ్డు ఉడకబెట్టి ఇచ్చా, జ్యూస్ తాగేసి స్నానం చేసి వచ్చి టిఫిన్ ఏం కావాలని అడిగితే... బ్రెడ్ టోస్ట్ అంట బ్రెడ్ కి వెన్నపూస పూసి దానికి కాల్చి మద్యలో మళ్ళీ తేనె వేసుకుని తిన్నారు. ఈ రోజు సరుకులు తెచ్చకుంటాం కదా రేపు చేసిపెడుదువు అని చెప్పారు. తరువాత కాఫీ ఇచ్చాను, తాగి కంప్యూటర్ లో ఏదో పని చేసుకుంటున్నారు. నేను కిందఉంటానని చెప్పి వస్తే మీరు ఇంకా లెగవలేదు, అందుకే అమ్మాయి గారికి క్యారేజ్ పెట్టేసి మనకి టిఫిన్ చేశా... ఇందాకే ఆయన ఈ డబ్బాలో పిలిస్తే వెళ్ళా నన్ను, మిమ్మల్ని రడీ అయితే ఓ గంటలో మార్కెట్ కి వెళ్దామన్నారు అందుకే లేపుదా మని మీ గదికి వస్తున్నా మీరు అప్పడే లేచి బయటకు వచ్చారు అంటూ రెండు నిమిషాల్లో రిక్యాప్ ఇచ్చేసింది సుమతి. మనసులో ప్రిన్స్ తో బైటకి వెళ్తున్నాననే ఆనందం ఉన్నా బయటకు మాత్రం ‘‘నేనెందుకు మీరిద్దరూ వెళ్ళిరండి’’ అంది ఉమాదేవి. ‘‘ఏమో... మీరే చెప్పండి’’ ఇదిగో అంటూ ఉమాదేవికి తన జాకెట్ లోనుండి వాకీటాకీ తీసి ఇచ్చింది. అవతల నుండి ప్రిన్స్ వీరి మాటలన్నీ వాకీ టాకీలో వింటూనే ఉన్నాడు... సుమతి వాకీటాకీని తన జాకెట్టులో పెట్టుకోవడంతో బటన్ ప్రెస్ అయ్యినప్పుడల్లా ప్రిన్స్ కి వీరి మాటలన్నీ వినబడుతున్నాయ్... ‘‘గుడ్ మార్నింగ్ దేవీ...’’ అన్నాడు ప్రిన్స్ వాకీటాకీలోనే. షాకైయ్యారు ఇద్దరు, ఉమాదేవి తీసుకుని బటన్ నొక్కి ‘‘గుడ్ మార్నింగ్?... నీకెలా తెలుసు నేను లేచానని?’’ అంది ఉమాదేవి. ‘‘సుమతి వాకీటాకీ ఎక్కడ పెట్టిందో గానీ, పొద్దున్నుండీ బటన్ ప్రెస్ అయ్యినప్పుడల్లా మీ ఇంట్లో మాటలన్నీ లైవ్ రిలే అయ్యాయి... సుమతి పనులు చేస్తూ పాడే కూనిరాగాలు, సుమతి-మీ అమ్మాయి క్యారేజ్ విషయంలో పడిని గొడవ... ఇప్పడు మీరిద్దరి బ్రేక్ ఫాస్ట్