ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 88

By | March 11, 2021
ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 88 సరే అని ఇద్దరమూ పెట్టిని మూసి మళ్లీ యధావిధిగా పూజామందిరం జరిపి దానికింద పెట్టి, మామ్మ చేసినట్టే హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి బయటకు వచ్చాము. అట్లా చెయ్యడం అనుకోకుండా జరిగినా మాకు మంచిదే అయ్యింది. బయటకు వచ్చి లల్లీ, నేనూ బట్టలు మార్చుకుని, “మామ్మా! నేను బయటకు వెళ్లి వస్తా. ఇంట్లోకి ఏమైనా కావాలా పాలే కాకుండా” అని అడిగా. “ఉండరా! నేనూ వస్తాను చెప్పటానికి గుర్తుకు రావట్లేదు. చూస్తేనే వస్తాయి” అంటూ తాను చీర మార్చుకుని వచ్చింది. మామ్మని బండి మీద తీసుకెళ్లడం కష్టం అని కారు తీసి మామ్మని ఎక్కించుకుని లల్లీకి సైగలు చేసి బయలుదేరా. మామ్మ కామ్ గా కార్లో కూర్చొని ఉంది. నేను డ్రైవింగ్ చేస్తూనే “మామ్మా! సారీయే!! ఆ దొంగమొఖం చెప్పమంటే చెప్పా. అసలు విషయం ఇప్పుడే చెప్తాను. అనివేష నేను చెప్పినట్టు మా ఫ్రెండు కజిన్ కాదు, నాగకన్య” అంటూ మొదలెట్టి పొద్దుట లాన్ లో జరిగిన దాకా మొత్తం చెప్పేసి తనకేసి చూసేసరికి, తన కళ్ళ వెంబడి ఒకటే ధారగా నీళ్లు కారుతున్నాయి. నేను ఖంగారుగా కారు పక్కకి తీసి ఆపబోతుండగా, మామ్మ “లేదురా విన్నూ! మరేం పర్లేదు. నా చిన్నప్పుడు జరిగిన విషయం గుర్తుకు వచ్చి ఆనందాన్ని తట్టుకోలేక కన్నీళ్లుగా బయటకు వచ్చాయి అంతే. మరేం పర్లేదు” అని కారు పోనీయ్యమంది. “ఏంటే మామ్మ నాకు చెప్పకూడదా” అంటూ ఆడిగేసరికి “నా చిన్నప్పుడు పొలం గట్లమీద ఆడుకుంటూ ఉండేప్పుడు నాకో పాము ఫ్రెండు గా ఉండేది. నా కాలిమువ్వల శబ్దం వింటూనే పుట్టలోంచి వచ్చి నా మువ్వల శబ్దానికి తగ్గట్లుగా తలవూపుతూ ఉండేది. అందరూ దానిని చూసి భయపడేవారు. నేను మాత్రం ఇంట్లోంచి పాలు దొంగతనంగా తీసుకుపోయి మరీ పట్టేదానిని. మా ఇల్లేమో గోదావరి నదికి దెగ్గరలో ఉండేది. పొలం దాదాపు రెండు మైళ్ళ దూరంగా ఉండేది. రోజూ ఇంటినుంచి జట్కాబండిలో వెళ్ళేదానిని. ఒకసారి నేను అలా ఆడుకుంటూ ఉండగా వేరే పాము నన్ను కాటు వేయడానికి చూసింది. ఈ నా ఫ్రెండు ఆ రెండో పాముతో ఫైటింగ్ చేసి దాన్ని చంపి ఇదీ చనిపోయింది. ఆ రోజున జ్వరపడ్డ దానిని నెల్లాళ్ళు మంచం దిగలేదు. మా నాన్న చివరికి ఎవరో జంగము దేవర ని పట్టుకు వచ్చాడు. ఆయన నా చెవిలో “ఎదో ఒకనాడు అది మళ్లీ నీ ఇంటికి సపరివారంగా వచ్చి నీ ఇంటనే ఉండిపోతుంది. కనుక నువ్వు చింత వీడి హాయిగా ఆడుకో” అని చెప్పాడు. చిత్రంగా ఆ సాయంత్రానికి నా జ్వరం తగ్గిపోయింది. ఆ జంగముదొర 52 ఏళ్ల క్రితం చెప్పినమాట ఈనాడు నిజము అవ్వుతుంటే ఆనందం వేసి కన్నీరు ఆగలేదురా విన్నూ” అంటూ కళ్ళు పూర్తిగా తుడుచుకుని, ఆ టెలిఫోన్ బూతు దెగ్గర ఆపు. ఇంటికి ఫోన్ చేసి ఆ అమ్మడుని అడగాలి వాళ్ళవాళ్ళు ఏమి తింటారో..” అని కారు ఆపమంది. నేను కారు ఆపి ఇంటికి ఫోన్ చేసి వాళ్లేమి తింటారో కనుక్కుని, మార్కెట్కి వెళ్లి మామ్మ చూపించినవన్నీ 20 రోజులకి సరిపడా సరుకులు, 10 రోజులకి సరిపడా కాయగూరలు కొనుక్కుని వస్తూ వస్తూ ఇంకో 3 లీటర్ల

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *