మహార్జాతకుడు 10
telugu sex stories rebus-dm.ru మహార్జాతకుడు 10 నేను ఇంటి దగ్గర నుంచి కాఫీ షాప్ కి వెళుతూ నా జీవితం గురించి ఆలోచించుకుంటున్నాను. కొద్దిరోజుల్లోనే నా జీవితం ఎలా ఉండేది ఎలా మారిపోయింది? ఇంతకు ముందు నన్ను చూసిన వారంతా నష్టజాతకుడు, రాక్షసుడు అని చెప్పి చీత్కరించుకునేవారు. కానీ ఇప్పుడు నన్ను చూసి అంతా దగ్గరవుతున్నారు. ముందు కవిత మేడం కుటుంబం, ఆ తర్వాత ఆ పిల్లాడి కుటుంబం, ఇప్పుడేమో అభి కుటుంబం, చివరిగా రుద్ర వీళ్ళంతా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు. అకస్మాత్తుగా నా తలరాతలో ఇన్ని మార్పులు ఎలా చోటుచేసుకుంటున్నాయి? అని తీవ్రంగా ఆలోచించినా నాకు ఎటువంటి సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే మన తలరాత ఆ పైవాడి చేతిలో ఉంటుంది.
అంటే నా ఉద్దేశ్యం మన అదృష్టం కేవలం భగవంతుని రాతల మీద ఆధారపడి ఉంటుంది అని కాదు. అప్పుడప్పుడు మనిషి తన అదృష్టాన్ని తానే రాసుకుంటూ ఉంటాడు. కాకపోతే అవకాశం కోసం ఎదురు చూడాలి. అదృష్టం అందరికి తలుపు తడుతుంది కానీ అది అందిపుచ్చుకునే వారు కొందరు మాత్రమే. సరైన సమయానికి దానిని అందిపుచ్చుకున్నామంటే ఇక వారి లైఫ్ గాడిలో పడినట్టే అని భావించవచ్చు. జీవితం ప్రతి క్షణం మనతో ఏదో ఒక కొత్త ఆట ఆడుతూనే ఉంటుంది. అందులో కొంతమంది ఓడిపోవచ్చు మరికొంతమంది గెలవచ్చు. అలా కొంతసేపు ఆలోచించుకుంటూ నడుస్తూ తర్వాత నా మదిలో నుంచి ఆలోచనలను తీసి పక్కన పెట్టి తొందరగా కాఫీ షాప్ కి చేరుకున్నాను.
అక్కడ పని చేసే వర్కర్స్ నన్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే