పెద్దమ్మ కోరిక 27
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 27 అన్నయ్యా .......... ఈరోజు కూడా మా సంతోషం చూడాలని మళ్లీ ఎప్పుడు కలుస్తారు మీ అన్నయ్య ఎక్కడ ఉంటారు బుజ్జాయిలూ అని అడిగారు అమ్మ .మేము తెలియదు అనిచెప్పడంతో మళ్లీ మా సంతోషం చూడలేరేమోనని మళ్లీ కన్నీళ్లు కార్చారు అమ్మ . అయ్యో అన్నయ్య ఎక్కడ ఉండేది తెలుసుకోలేదని ఫీల్ అయ్యాము . కీర్తి : తలెత్తి అన్నయ్యా .......... మిమ్మల్ని చూడకుండా ఉండలేము మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి రోజూ కలవాలి అని గట్టిగా చుట్టేసింది .బిస్వాస్ : అవును అన్నయ్యా ......... రాత్రంతా మిమ్మల్నే కలవరిస్తూ రెండుసార్లు సడెన్ గా లేచికూర్చుని , అమ్మా - అన్నయ్యా ........... రేపు అన్నయ్య కనిపిస్తారుకదూ అని అమ్మను బాధతో కౌగిలించుకుంది .తప్పకుండా బంగారుతల్లీ .......... నేను కొలిచే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారు మన కష్టాలన్నీ తీర్చేస్తారు అని ఓదార్చి గుండెలపై పడుకోబెట్టుకుని