శృంగార నగరం 5
ఎవరయినా ముసలివాళ్ళు అయిపోతారని ఇప్పుడు నలభై ఏళ్ళు నిండినవాడ్ని కట్టుకోమంటున్న అమ్మ లాజిక్ నాకు అర్థం కాలేదు.
"కానీ-"
"అలా నసగొద్దు. నువ్వు నాకు ఒక్కదానివే. నీ ముందూ వెనకా ఎవరూ లేరు మాకు. నువ్వు ఎవర్నో చేసుకుని ఎక్కడో కాపురం చేసే దానికన్నా ఇక్కడే మనింట్లోనే వుండిపోవాలని మా కోరిక. నీకు పెళ్ళి అయి నీ కడుపునా ఓ కాయ కాస్తే వాడితో ఆడుకుంటూ ఈ శేష జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. నిన్ను చేసుకొని ఇక్కడే ఇల్లరికం వుండిపోయే వాడు మనకు దొరకద్దూ. చలపతి అయితే ఆల్ రెడీ ఇక్కడే వున్నాడు. నిన్ను చేసుకున్న తరువాత కూడా ఇక్కడే వుండిపోతాడు."
"అదిగాదే"
"ఇంక నీ సందేహాలూ, అపనమ్మకాలూ నేను వినను. ఇంకో రహస్యం చెప్పనా? ఈ ఆస్థి అంతా ఎవరో తినిపోవడం కన్నా మన ఆస్థి మనమే తింటే పోలా. వాడు ఎవరో పరాయివాడు కాడు. నాకు తమ్ముడు. మీ నాన్నకు పెదబామర్ది. నీకు మావయ్య. మన ఆస్థి మన దగ్గరే వుండాలంటే వాడయితేనే బెస్టు. పెళ్ళి అంటే ఏదో సంవత్సరం, రెండు సంవత్సరాల ముచ్చట కాడు నూరేళ్ళ పంట."
అదే నా బాధ అంతా. నూరేళ్ళలో అప్పటికే నలభై ఏళ్ళు అయి పోయినవాడ్ని చేసుకోమనడం దారుణం. అందుకే నిక్కచ్చిగా చెప్పాను. "ఒద్దే అమ్మా! నువ్వు నూరు చెప్పు, లక్ష చెప్పు, నలభై ఏళ్ళవాడిని నేను చచ్చినా చేసుకోను."