శృంగార నగరం 12
ఓరోజు మా వారు ఆఫీసుకు బయలుదేరుతున్నారు. స్నానం చేసి లుంగీ మొలక చుట్టుకుని తయారవడం మొదలుపెట్టారు.
కాఫీ తీసుకుని వెళ్ళి యిచ్చాను. ఆయన్ను చూస్తునే జయంత్ గుర్తుకు రావడంతో "పొట్ట చూడండీ ఎంత అసహ్యంగా వుందో! ఎప్పుడూ ఆ జయంత్ లా టక్ చేసుకోండి" అన్నాను.
ఆయన ఏమనుకున్నారో తెలీదు. ఎప్పుడూ ఆయన అతిగా మాట్లాడరు. ఏ ఫీలింగ్ నీ ఎప్పుడూ ఎక్స్ ప్రెస్ చేయరు. ఎప్పుడయినా పూలు ఇంటికి తెచ్చినా దాన్ని అలా సోఫా మీద పడవేస్తారే తప్ప "పూలు పెట్టుకో" అని అనరు. చివరికి రొమాన్స్ లో కూడా అంతే. నిశ్శబ్దంగా వుంటారే తప్ప. నోరువిప్పి మాట్లాడరు.
నిజానికి ఆయనను జయంత్ తో పోల్చిచూడడం తప్పు. నలభైఏళ్ళ వాడికి ఇరవై రెండేళ్ళ కుర్రాడితో పోల్చి అలా వుండమని అడగడం ఎబ్బెట్టుగా వుండే విషయం. జయంత్ ఎప్పుడూ టక్ చేసుకుని వుంటాడన్న భ్రమ నాకుంది. అతనూ ఇంట్లో మా ఆయనలానే పొట్ట కనబడటేట్టు లుంగీ లు వుంటాడన్న నిజం నాకు తట్టలేదు.
ఇలా విశ్లేషించుకుంటూ పోతే దేన్నీ సరిగా అనుభవించలేమనుకుంటా. అందుకే చాలామంది హృదయం ఎలా చెబితే అలా నడుచుకుంటారే తప్ప బుద్ధితో ఆలోచించరు. నేనూ అంతే.
సాయంకాలమైతే నేనూ, పిల్లలూ నర్సరీ దగ్గరికి వెళ్లడానికి తయారైపోయే వాళ్ళం. ఎప్పుడైనా జయంత్ కనిపించకపోతే ఏదో వెలితిగా వుండేది. అయితే ఆ వెలితి ఎందుకో, అతను నుంచి నేను ఏం కోరుకుంటున్నానో నాకే తెలీదు.