మోజు పడ్డ మగువ 30
మొత్తం భూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. మనుషులంతా ఆ విస్ఫోటనానికి మరణిస్తారు. మనిషి ఇంతకాలంగా నిర్మించుకున్న నాగరికతంతా క్షణంలో బూడిదై పోతుంది. ఈ భవంతులు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు సర్వం నాశనమైపోతాయి. ముక్కలు ముక్కలుగా విడిపోయిన భూమి విశ్వంలోకి విసిరివేయబడుతుంది. అంటే మానవ చరిత్రకు, భూమి చరిత్రకు మరో వారంలో చరమగీతం పాడబోతోంది షూమేకర్- లెవీ-10
మొత్తం వార్తంతా చదవగానే సూర్యాదేవికి చెమటపట్టింది. దిగులు, బాధా కలగాపులగంగా కలిసిపోయాయి. చిన్నగా శరీరం వణుకుతోంది. ఎంత కంట్రోలు చేసుకున్నా వీలు కావడంలేదు.
ఆమెకు చప్పున వసంత్ గుర్తొచ్చాడు.
కన్నతల్లిదండ్రులకన్నా, కట్టుకున్న భర్తకన్నా అతను గుర్తురావడం ఆశ్చర్యమనిపించింది. తను అతనిని అంతగా ప్రేమిస్తోందా? ప్రేమంటే ఇదేనా?
అయినా భూమి ముక్కలై పోతున్నప్పుడు కూడా ఈ సందేహాలు తనను వదలవా?
వసంత్ కూడా అదే రోజు గడువుపెట్టాడు.
శాస్త్రజ్ఞుల అంచనాల మేరకు శుక్రవారం సాయంకాలం అయిదు గంటలా పదిహేను నిముషాలకి షూమేకర్ భూమిని ఢీ కొంటుంది.
ఆరోజు సాయంకాలం ఆరుగంటలకి తనను రమ్మన్నాడు వసంత్. అప్పటికే భూమి ముక్కలు ముక్కలు కింద విడిపోతుంది. అయిదున్నరకల్లా వసంత్ కొండచివర తనకోసం టెన్షన్ తో ఎదురుచూస్తుంటాడు. అయిదున్నరకి వచ్చి ఆరుగంటల వరకు తనకోసం చూస్తానన్నాడు.
Ok