మోజు పడ్డ మగువ 22
ఇలా మాట్లాడేవాడు మిత్రుల దగ్గర.
వాడికి పెళ్ళయి కవిత మా వూరికి కోడలిగా వచ్చింది.
మొదటిరాత్రి నుంచే వాడు తన థీరిని ప్రాక్టీస్ లో పెట్టాడు. "నువ్వు పెద్ద అందంగా లేవు ముక్కు ఒక్కటి బావుందనుకో, మిగిలిన పార్ట్ లన్నీ ఎబ్బెట్టుగా వున్నాయి. పెళ్ళిచూపుల్లో నువ్వు నాకేమీ నచ్చలేదు. కానీ ఏదో అడ్జెస్ట్ అయిపోదామని చేసుకున్నాను" అని ప్రారంభించాడు.
కవిత నిజానికి చాలా మెత్తటిపిల్ల. భర్త అలా అనేసరికి ఎంతో బాధ పడిపోయింది. పైకి మాత్రం దాన్ని ఎక్స్ ప్రెస్ చేయలేదు. మరెప్పుడో ఏదో సందర్భం వచ్చినప్పుడూ ఇంతే.
"నువ్వు డబ్బుల విషయంలో ఏమీ సలహాలు ఇవ్వకు. నూర్రూపాయలకు చిల్లర మార్చలేనిదానివి. నీకెందుకు డబ్బుల గొడవ" అని కసురుకున్నాడు.
ఇలాంటిదే మరో సందర్భం.
"ఎనేలన్తి దరిద్రపుగొట్టు ముఖం ఎదురొస్తే ఇక పని జరిగినట్లే. నువ్వు మంచినీళ్ళు అడిగితే ఎదుటివ్యక్తికి విషం ఇవ్వాలనిపిస్తుంది"
ఇలా సమయం వచ్చినప్పుడు కవితను హింసించేవాడు. తను ఎందుకూ పనికిరాని దాన్నేమో అని కవిత తనకు తనే నమ్మే స్థితికి వచ్చేసింది.
తన పథకం ప్రకారం తన భార్యలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ప్రవేశపెట్టి, దాన్ని ఓ భూతస్తహయికి తీసుకొచ్చేసినందుకు తెగ సంతోష పడిపోయాడు చంద్రశేఖర్ అంత ఇన్ఫీరియారిటీ డెవలప్ అయినప్పుడు కట్టు తప్పదని అతని గొప్ప నమ్మకం.