మోజు పడ్డ మగువ 20
ఆరోజు మా తమ్ముడ్ని టౌన్ కి పంపించి వేశాను. రెండోరోజు ఉదయం రమ్మని ఏభై రూపాయలు ఇచ్చాను. వరసగా సినిమాలు చూసి వస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడు.
మంచంలో పడుకున్నాను.
అది ఎండో, వెన్నెలో తెలియడం లేదు. సూర్యుడు వున్నాడు కనుక ఎండా అనుకున్నాను తప్ప మనసు ఫీలైంది కాదు.
సూర్యకిరణాల్ని బంగారు జల్లెడలో జల్లించి పంపిస్తున్నట్లుంది.
నాలుగు గంటల ప్రాంతాన మా అమ్మ కాఫీ తీసుకుని పైకొచ్చింది.
"ఏమిటే నీ వాలకం. కొత్త పెళ్ళికూతురైనప్పుడు కూడా ఇంత కళగా లేవు నువ్వు" అంది కాఫీ అందిస్తూ.
"చాలా రోజుల తఃరువాత పుట్టింటికి రావడం కదా అదీ సంతోషం" అన్నాను.
కాఫీ తాగాక కిందికి దిగివచ్చాను.
ముఖం కడుక్కుని లైట్ గా పౌడర్ అద్దుకున్నాను.
సన్నజాజుల దండ కట్టాను. సన్నగా చంద్రవంకలా అమరింది నా తల్లో.
వెన్నెలకు బదులు సువాసనలు వెదజల్లుతున్న చంద్రవంకలా వుందది.
మళ్ళీ చీరా జాకెట్టు మార్చుకున్నాను.