ఈ రాత్రి నీకు బహుమతి 3
అతనూ కూల్ గా సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు.
"నేను అనాధను నేను పుడుతూనే అమ్మా నాన్న తమ పని అయిపోయినట్టు చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగాను. గొడ్డుచాకిరీ చేయించుకుని గొడ్డుకారం, సంగటీ వేసేవాళ్ళు ఆ కారం తినేప్పుడంతా మనసు చల్లగా ఉంటుందని అమ్మను తలుచుకునే వాడ్ని బడికి సక్రమంగా పంపకపోయినా ఎలాగోలా పదవ తరగతి పాసయ్యాను. ఓరోజు మామయ్యకు, నాకూ ఘర్షణ జరిగింది"
"ఎందుకు?" అతను ఆపడంతో లిఖిత అడిగింది.
"అత్తయ్య గొలుసు పోయింది"
"బంగారందా?"
"ఆ...."
"నువ్వు ఎత్తుకున్నావా?"
"లేదు"
"మరి?"
"అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఉద్యోగంలో చేరడానికి లంచం ఇవ్వాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బులేదు! అత్తయ్యను అడిగాడు. కుదవపెట్టి డబ్బు తీసుకోమని అత్తయ్య తన గొలుసు ఇచ్చింది. అప్పుడు ఇదంతా చాటుగా ఉండి చూశాను.....