ఈ రాత్రి నీకు బహుమతి 16
ఆ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సుబ్బరామయ్య రెండు బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తాడు.
ఆ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే సుబ్బరామయ్య ఏటిభూముల దగ్గరికి వెళ్ళాను.
అక్కడికి ఎవరూ రాలేదు. ఏ స్త్రీ గానీ అక్కడ అనుమానం పరిస్థితుల్లో తిరగాడలేదు.
ఇంటికి తిరిగి వచ్చాక గోకుల్ తో అవీ ఇవీ మాట్లాడుతూ కూర్చున్నాను.
అతను నేనడిగిన దానికి పాపం తీరిగ్గానే జవాబులు చెబుతున్నాడు.
"మన వూరి నుంచి కూలీలు బాగా వస్తున్నారా?" అనడిగాను.
"లేదు ఆ పొలంలో పని చేయడానికి మన ఊరి వాళ్ళను పిలవడం లేదు. అంతా అటు పక్కనున్న ఊరినుంచే పిలుచుకొస్తున్నాను...." అతను ఏదో చెబుతున్నాడు గానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను.
అయితే రహస్యం తాలూకు వేర్లు పక్క ఊర్లో వున్నాయన్న అనుమానం మొదలైంది.
ఆ వూర్లో అమ్మాయే గోకుల్ మనసు దోచుకుని వుంటుందని అర్ధమైంది.
ఆ రోజు సాయంకాలమే ఆ వూరు వెళ్ళాను.
గోకుల్ పొలంలో పనిచేసిన వాళ్ళలో కొందరితో మాట్లాడాను. వాళ్ళల్లో ఎవరూ కారు.