కామాంధుడి కిరాతకాలు 19
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 19 కొన్ని క్షణాలకి తేరుకుని, సెల్‌ఫోన్‌ని ముందుకీ వెనక్కీ జరుపుతూ నాగ్‌వీర్ కళ్ళని ఎంతో నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత తలెత్తి, "ఇప్పుడేమంటావ్ నువ్వు..! నీ డౌటేంటి..?" అని పూర్తిగా బ్లాంక్ అయిపోయిన బ్రెయిన్‌తో అడిగారు కృష్ణమూర్తి.వచ్చినప్పటి నుంచీ తాను చెప్పిన దాన్ని గాలికొదిలేసి, మళ్ళీ మొదటికొచ్చినట్టు అడుగుతున్న ఆయన ప్రశ్నని వినగానే చిర్రెత్తింది మనీషకి."ఇతని కళ్ళల్లో మేగ్నటిక్ పవర్, హిప్నాటిక్ పవర్, మెస్మరైజింగ్ పవర్,.. మీరు ఏదో ఒక పేరు పెట్టుకోండి దానికి. కానీ అమ్మాయిల్ని పడేసే ఆ పవర్ ఉందా, లేదా.." అని సూటిగా, నిక్కచ్చిగా, చాలా సీరియస్‌గా అడిగింది మనీష.నాగ్‌వీర్ పిక్‌ని మళ్ళీ పరీక్షగా చూస్తూ, తన అభిప్రాయాన్ని కొంచెం మార్చుకుంటున్నట్టు నిలువుగా తలూపారు ప్రొఫెసర్ కృష్ణమూర్తి.సరిగ్గా అదే సమయానికి.. హోటల్ స్వర్ణా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టింది శిల్ప. రూమ్ నెంబర్‌ని గుర్తు చేసుకుంటూ లిఫ్ట్ వైపు నడిచింది.టూ జీరో ఎయిట్ దగ్గరకెళ్ళి బెల్ కొట్టింది. కొద్ది సెకన్స్‌కే డోర్ తెరుచుకుంది. లోపల ఎక్స్ టీమ్‌లీడర్ వెంకట్ కనిపించాడు. "చెప్పు.. ఎందుకు రమ్మన్నావ్.." సీరియస్‌గా