ఇదీ కధ 6

By | November 22, 2019
ఇదీ కధ 6  "ఇదంతా మనవాడి పనేనయ్యా యస్పీ గారూ! "సాగర్! ఏమిటిదంతా? మాధవిని తీసుకుని ఎక్కడికి వెళ్ళావ్?" ఆ గొంతు వినడంలో సాగర్ కు మైకం వదిలినట్టయింది. తండ్రి ఎదురుగా నిలబడి తన వైపే తీవ్రంగా చూస్తున్నాడు. రామనాధం గారు ఈజీ చైర్ లో తలపట్టుకొని కూర్చొని వున్నాడు. డాక్టర్ మూర్తి స్టేతేస్ స్కోపు తో రామనాధం గారి గుండె పరీక్షిస్తున్నాడు. "అమ్మా నా తల్లి వచ్చావా?" నాగరత్నమ్మ మాధవిని కౌగలించుకుంది. "డాక్టరు గారూ నాకు ఇహ ఏ పరీక్ష వద్దు. నా గుండె బాగానే ఉన్నది. మాధవి వచ్చి నా పక్క కుర్చోమనండి." రామనాధంగారి నీరసంగా వున్నా లేని ఓపిక తెచ్చుకొని అన్నాడు. మాధవి వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నది. మాధవి చేతులు పట్టుకొని నిమురుతూ హటాత్తుగా ఆగిపోయాడు. "ఏమిటి తల్లీ ఈ గాయం?" ఖంగారు పడ్డాడు రామనాధం. మాధవి మౌనంగా కూర్చుని సాగర్ కేసి చూసింది. 'అదేమిటయ్యా? అమ్మాయికి అంత గాయం అయింది? ఏం చేశావేమిటి?' నాగరత్నమ్మ గయ్యిన లేచింది. "సాగర్ ఏం చేయలేదమ్మా. సాగర్ చేతికి కూడా గాయమయింది చూడు!" అన్నది మాధవి మళ్ళీ తండ్రి వైపు తిరిగి "నాన్నగారూ! సాగర్ లేకపోతే నేను ఇంటికి చేరేదాన్ని కాదు" అన్నది. "నా తండ్రే నా బంగారమే! నీ రుణం నేను తీర్చుకోలేము బాబు! ఒక్కగానొక్క బిడ్డను బ్రతికించి మా కళ్ళ ముందు నిలిపావు." నాగరత్నమ్మ సాగర్ రెండు చేతులు పట్టుకొన్నది. "ఇంతకీ ఎమైందర్రా? అసలు విషయం చెప్పరేం?" డాక్టర్ మూర్తి ఉత్కంట తో అడిగాడు. "డాక్టర్ గారూ! అవన్నీ తరువాత చూసుకోవచ్చు! ముందు వాళ్ళ గాయాలకు కట్టు కట్టండి. ఏం డాక్టర్లయ్యా బాబు మీరు? మీరు కూడా పోలీసుల్లాగానే ముందు విచారణ అయితే కానీ ట్రీట్ మెంట్ మొదలు పెట్టారా ఏం!' జడ్జి గారి వదనంలో దరహాసం నిండిపోయింది. "అలా కాదు సార్! పోలీసు వాళ్ళు ముందు ట్రీట్ మెంట్ ఇచ్చాక విచారణ మొదలు పెడతారు" సాగర్ నవ్వుతూ అన్నాడు. "మిస్టర్ సాగర్! పోలీసు వాళ్ళిచ్చిన ట్రీట్ మెంటుకే మేము ట్రీట్ మెంట్ ఇవ్వవలసి వుంటుంది. పోలీసు వాళ్ళ దెబ్బలు పైకి కనిపించవు. అందుకేమేము విచారణ చేస్తాము. దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయోనని!" డాక్టర్ మూర్తి సాగర్ చేతి గాయాన్ని పరీక్షిస్తూ అన్నాడు. ఎస్పి సాంబశివరావు వచ్చే నవ్వుని ఆపుకున్నాడు." అంతవరకు గంభీరంగా ఉన్న మొహం ప్రశాంతంగా మారింది. టెలిఫోన్ దగ్గర కెళ్ళి క్రైం బ్రాంచికి ఫోన్ చేశాడు. "జడ్జి గారమ్మాయి తిరిగి వచ్చేసింది. కాల్ ఆఫ్ ది సర్చ్! అన్ని స్టేషన్ లకు ఇంటిమేషన్ ఇవ్వండి" మాధవికీ, సాగర్ కు కట్టు కట్టడం పూర్తి చేసి, చేతులు కడుక్కుంటూ సాగర్ని చూస్తూ అన్నాడు డాక్టర్------ "ఏమిటోయ్! అంత ఘాటయిన ప్రేమ." బ్లేడు తీసుకొని ఒకరి చేతులు ఒకరు కోసుకున్నారా?" "బ్లేడు కాదు! గాజు పెంకు!" సాగర్ చెప్పాడు. "ఓ! ఐసీ! అయితే అది ఇంకా ఘాటయిన ప్రేమకు చిహ్నామన్న మాట!" అందరూ నవ్వుకున్నారు. 'అది సరే కాని నాకు తెలియకడుగుతాను గాజు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *